Monday, November 27, 2017

ఆరామ సామ్యవాదం


విగ్రహారాధనను వ్యతిరేకించిన తాత్వికుడి
విగ్రహాల ముందు సాగిలపడటమే 
నేటి  ఆధునికత

బ్రాహ్మణ జాతక కథల్లో గొప్పదనాన్ని చెప్పడం 
ఆధునిక బౌద్ధ చరిత్ర 

బౌద్ధ హంతకుడు నాగార్జునుడ్ని 
పోగడటం కొత్త తత్వం

..…………………………………

బౌద్ధం ఎంటో తేలుసుకోవాలా? 
రా. పలుగు, పార తీసుకొని, రా

ఇప్పుడు
తవ్వుతూ తవ్వుతూ
నేల లోతుల్లోకి వెళ్లి వెతుకు
ఎముకలైన బౌద్ధ బిక్షువులు కనబడతారు
హిందు ఆలయాల పునాదుల్లో వెతుకు
బౌద్ధ ఆరామాల స్మృతులు కనబడతాయి

చరిత్రలో ధ్వంసమైనా పుస్తకాలు,
కొన్ని పుస్తకాల్లో మాయమైన పుటలుంటాయి
జాగ్రత్తగా వెతుకు
అక్షరాల్లో దాగిన 
'ఆరామ సామ్యవాదం' కనిపిస్తుంది
మందులు చల్లని పంటను కోసి చూడు
మాంసపు ముద్దల వాసనొస్తుంది

…………………………………………

తొలకరి చినుకుల్లో నువ్ ఆస్వాదించే
పరిమళం ఏమిటో గాని

నాకు మాత్రం 
ఎండి ఎండి ఉన్న నేలను చినుకు తడిపిన 
ప్రతిసారి పచ్చిబడుతున్న ధిక్కార యోధుల
వెచ్చని నెత్తుటి వాసనే

(బుద్ధుడి పటాల ముందు చేతులు జోడించి సాగిలపడటమే బౌద్ధంగా, ముఖపుస్తకంలో స్ఖలించడాన్ని చూసి, బుద్ధుడిపై అచంచలమైన ప్రేమతో)

No comments:

Post a Comment