Friday, November 24, 2017

ఎదలో మాట



నా అల ఊహ కాదు. రక్తమాంసాలతో కళ్ళముందు కదలాడే సజీవ రూపం. 'అల' ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదులోకి అడుగిడుతుంది. మా 'కల'కి మొన్ననే యాభై వసంతాలు నిండిన ఇంకా నూతనోత్తేజంతో ఉరకలు వేస్తుంది. 'అల' 'కల' They both are apple of my eyes. 'అల ఎడనిండా నిండిన జ్ఞాపకమైతే, కల చిన్ననాటి నుండి కండ్ల నిండా నింపుకున్న పోరాటం'. 'కల' అలది. నాది. మా ఇద్దరిది. 'అల'ని 'కల'ని కలిపి రాయాలని చేసిన ఓ ప్రయత్నమే 'మబ్బుల చీల్చుకు వచ్చిన వెన్నెల'. 

అల ఇప్పుడు నాతో లేదు. నేను అలతో లేను. అల మళ్ళీ వస్తుంది. ఎప్పటిలాగే. తనలాగే. నవ్వుల్ని, కలల్ని, జ్ఞాపకాల్ని వెంటేసుకొని. 'ఎడబాటును చెరిపేసే చిరునవ్వుతో,కండ్ల నిండా నింపుకున్న కలతో'. తను వస్తుందనేది ఆశకాదు. నమ్మకం. తన మీద. కలమీద ఉన్న నమ్మకం. అప్పుడు ఎప్పటిలాగే అలని రాయాలి. అలతో పాటు మా ఇద్దరి కలని కలిపి రాయాలి. అనుభవాల్ని, అనుభూతుల్ని, స్వప్నాల్ని అక్షరాల్లోకి ఒంపాలి. అక్షరం వెనుక అక్షరం. పదంతో పాటు పదం. వెరసి వాక్యం. ఆ వాక్యం కవిత అవ్వచ్చు. కథ అవ్వచ్చు. నవలా అవ్వచ్చు. 

అల పంచిన జ్ఞాపకాలు.
అలతో పంచుకున్న జ్ఞాపకాలు ఈ కవితలు.
అలని అక్షరాల్లోకి ఒంపే చిరుప్రయత్నమే ఈ కవితలు.


https://drive.google.com/file/d/1_4zyuYNBiNC4j25z-3xslXRfyVqMyjuQ/view?usp=drivesdk

No comments:

Post a Comment